పేకాట స్థావరం పై దాడి…

– నలుగురు పై కేసు నమోదు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారాయణపురం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.మంగళవారం ఎస్.హెచ్.ఒ ఎస్ఐ పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న అదే గ్రామానికి చెందిన నరదల వీర కృష్ణ,సగిరి నాగు, అన్నవరం దుర్గాప్రసాద్, నరదల రాము అనే వ్యక్తులు పట్టుబడ్డారు.వారి వద్ద రూ.5200 లు నగదును స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.