పేకాట స్థావరాలపై దాడి

– పేకాట రాయుల అరెస్ట్, రూ.6వేలు స్వాధీనం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో బహిరంగ ప్రదేశంలో రెండు పేకాట స్థావరాలపై గురువారం అర్ధరాత్రి దాడి చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం రూ.6వేలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పేకాటరాయులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.