పార్మాసిటీ భూసేకరణ ప్రజాభిప్రాయం సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తోపాటు ఇతర అధికారులపై రైతులు దాడి చేయడం హేయమైన చర్యని కాటారం తహశీల్దార్ నాగరాజు,మల్హర్ తహశీల్దార్ రవికుమార్ లు అన్నారు.కలెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి నిరసనగా మంగళవారం తహశీల్దార్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్న సమయంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా తహశీల్దార్ లు మాట్లాడారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ భౌతిక దాడులు చేసి ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.