నవతెలంగాణ – డిచ్ పల్లి
భీమ్ గల్ ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు మాధవ్ ఆధ్వర్యంలో ఇందల్ వాయి మండలంలోని పలు తాండలపై దాడులను నిర్వహించి ఇద్దర్ని అరెస్టు చేసి ఇందల్ వాయి తాహసిల్దార్ వెంకట్రావు ముందు బైండోవర్ చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుమాధవ్ తెలిపారు.శనివారం ఇందల్ వాయి మండలంలోని డోంకల్,వెంగళ్ పాడ్, దేవి తండా లలో భీమ్ గల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ నిజామాబాద్, ఏసి ఎన్ఫోర్స్మెంట్ల ల ఆధ్వర్యంలో తాండలపై మెరుపు దాడులు నిర్వహించగా ధూమ్కల్ తిన్న మూడవత్ సోమ్లి,వెంగళ్ పాడ్ కు చెందిన భదవత్ విఠల్ లను అదుపులోకి తీసుకొని వారిద్దరిని అరెస్టు చేసి తాసిల్దార్ వెంకట్రావు ముందు బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో భీంగల్ ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ హెడ్ కానిస్టేబుల్ ఫయాజ్ పఠాన్, సిబ్బంది దత్తు, మహేష్, జగదీష్ తో పాటు తదితరులు ఉన్నారు.