– వైన్ షాపులు, హోటళ్లపై ఆకస్మిక తనకి
– పలు షాపుల నుండి శాంపిల్స్ సేకరణ
– నిర్ధారణ జరిగితే చట్ట పర చర్యలు
– ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు లేనియెడల ఐదు లక్షల జరిమానా
– జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ పట్టణంలోని పలు వైన్ షాపులు, హోటల్స్ పై, జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి తో కలిసి ఆకస్మిక దాడులు జరపగా వైన్ షాప్ యజమానుదారులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ ఎస్ ఎస్ ఏ లైసెన్స్ అనుమతులు లేకుండా విక్రయాలు జరుగుతున్నందున నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్లు అమ్మే ఆల్కహాల్ కూడా ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టంలోకు అనుకూలంగా లేవని అనుమానించి వివిధ రకాల ఆల్కహాల్ శాంపుల్స్ ని సేకరించడం జరిగింది. శాంపుల్స్ నివేదికల ఆధారంగా వారి మీద తీవ్రతను బట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అలాగే కల్తీ మద్యం గాని, మద్యం ను మిస్ బ్రాండింగ్ చేసి అమ్మినట్లయితే కూడా చట్టపరమైనటువంటి కేసులు, శిక్షలు ఉంటాయని, అలాగే ప్రతి వైన్స్ వ్యాపారదారుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు తప్పనిసరిగా పొందాలని లేనియెడల ఐదు లక్షల జరిమానాలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.