కులవృత్తులపై అటవీ అధికారుల దాడి మానుకోవాలి 

Attacks by forest officials on tribals should be avoidedనవతెలంగాణ – కానరావుపేట
కులవృత్తుల వారిపై అటవీ అధికారుల దాడి సరైంది కాదని విశ్వకర్మ జిల్లా అధ్యక్షుడు చందనగిరి గోపాల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కుల వృత్తులు అంతరించే క్రమంలో పేదవారైనా వడ్రంగులు రైతులకు సంబంధించి చిన్న చిన్న పనిముట్లు చేస్తూ జీవనం సాగిస్తున్న వడ్రంగులపై అటవీ శాఖ అధికారులు దాడి చేసి వారి పనిముట్లను తీసుకెళ్లడం సరైనది కాదని పనులు లేక పస్తులు ఉంటున్న క్రమంలో చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిపై దాడులు చేయడం సరైనది కాదని అటవిలోని కలపను నరికి వేస్తుంటే చోద్యం చూస్తున్న అధికారులు ఒక పేద వడ్రంగి వద్దకు వచ్చి దాడులు చేసి పనిముట్లను తీసుకెళ్లడం సమంజసం కాదని అన్నారు.ఇకపై పేద వడ్రంగి లపై దాడి చేస్తే రాష్ట్ర అటవీ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.ఇకపై దాడులు మానుకోవాలని అటవీ అధికారులను కోరారు.