
– అఖిలపక్షం మండల బంద్ పాక్షికం..
– పోటాపోటీగా బంద్ లో పాల్గొన్న అఖిలపక్షం,అధికార పార్టీల నాయకులు
– ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును హరిస్తున్నారని అఖిలపక్షం ఆరోపణ
– హమీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అసహనం
– ఇచ్చిన హామీలు,అభివృద్ధిపై చర్చకు సిద్దమని బీఆర్ఎస్ పార్టీకి సవాల్
నవతెలంగాణ-బెజ్జంకి
తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేల ప్రత్యేక చోరవ చూపాలని ప్రజాప్రతినిధులకు విన్నవించుకోవాడానికి పంచాయతీ కార్మికులకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ నాయకులపై మండల బీఆర్ఎస్ నాయకులు సహనం కోల్పోయి దాడులా చేస్తారా అని బీఎస్పీ నాయకులు ధ్వజమెత్తారు.బీఎస్పీ నాయకులపై బీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ అఖిలపక్షం నాయకులు మండల బంద్ కు పిలుపునివ్వడంతో బుధవారం అఖిలపక్షం నాయకులకు పోటిగా బీఆర్ఎస్ నాయకులు పాల్గొనడంతో మండల కేంద్రంలో బంద్ పాక్షికంగా జరిగింది.ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడారు.ప్రజాస్వామ్యంలో పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వ ప్రతినిధులను తమకు నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకునే హక్కు ప్రజలకు ఉందని..సమస్యల పరిష్కారంలో చోరవచూపాల్సిన ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ నాయకులు సహనం కోల్పోయి దాడికి పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని,ప్రశ్నించే హక్కును హరించడమేనన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమై దాడికి పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.మండలాన్ని అభివృద్ధి చేశామని గోప్పలు చెబుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు,అభివృద్ధిపై చర్చుకు సిద్దమని సవాల్ చేశారు.ఇప్పటికైన మండల ప్రజలను మభ్యపెట్టకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు ఇచ్చిన వంద పడకల ఆస్పత్రి,తరలిపోయిన గురుకుల పాఠశాల, నిరపేదలకు డబుల్ ఇండ్లు అందజేత,పాలిటెక్నిక్ కళాశాల,దళిత బంద్,బీసీ సహయం వంటి హమీలను పారదర్శకంగా చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు.అఖిలపక్షం నాయకుల పిలుపు మేరకు వాణిజ్య దుకాణాల యాజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి అఖిలపక్షం నాయకులు యత్నించగా పోలీసులు ఆరగెంట్రం చేసి అడ్డుకున్నారు.బీఎస్పీ, సీపీఐ(ఎం),సీపీఐ,కాంగ్రెస్,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
అఖిలపక్షాలు అసత్యారోపణలు మానుకోవాలి
పంచాయతీ కార్మికుల సమస్య సాకుతో బీఎస్పీ నాయకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అడ్డుకునేందుకు యత్నించి..పోలీసుల సమక్షంలో దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకులు అసత్యారోపణలు మానుకోవాలని మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.ప్రజల ప్రయోజనార్థం ఎల్లవేళల అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే రసమయిపై,ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై అర్థరహితమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అఖిలపక్షం నాయకులకు తగదని బీఆర్ఎస్ శ్రేణులు హితవు పలికారు.అఖిలపక్షం నాయకుల బంద్ పిలుపును నిర్వీర్యం చేసిన వాణిజ్య దుకాణాల యాజమానులకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.