వాణిజ్య పన్నుల శాఖ అధికారులపైదాడులు 

– నిఖా లో భాగంగా కల్లూరులో తనిఖీ 

– లచ్చం అడిగితే నిర్భయంగా మా దృష్టికి తీసుకురండి 
–  ఏసీబీ డీఎస్పీ రమేష్ 
నవతెలంగాణ – కల్లూరు 
పట్టణ పరిధిలోని ఎన్ ఎస్ పి క్రాస్ రోడ్ నందు గురువారం తెల్లవారుజామున , ఖమ్మంవాణిజ్య శాఖ అధికారులు వెళుతున్న సమయంలో మెగా పెట్టి ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఖమ్మం వాణిజ్య పనుల శాఖ అధికారి ఏసిపిఓ-1 శ్రీరామ్, వారి సిబ్బందినిపై అనేక అవినీతి ఆరోపణలు గత కొంతకాలం నుండి నిఘా పెట్టామన్నారు పక్క సమాచారంతో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో కల్లూరులో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి వై రమేష్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పలుపై పలు ఆరోపణలు రావడంతో, వారిపై ప్రత్యేక నిగా పెట్టి దాడులు నిర్వహించగా వారి వద్ద అనధికారికంగా సుమారు 10, వేలు నగదు ఉండటంతో నగదుకు సంబంధించి సరియైన ఆధారాలు లేవు దింతో పాటు సిబ్బంది మొబైల్ ఫోన్లో కూడా పెద్ద మొత్తంలో నగదు మార్పిడి జరిగింది గా గుర్తించినట్లు పేర్కొన్నారు. రికార్డులు విషయంలో కూడా సరైన ఆధార పత్రాలు సరిగా లేవని అనధికార నగదును సీజ్ చేసామన్నారు. ఏసిపిఓ సిబ్బందిని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రభుత్వ అధికారులు ఎవరినైనా లంచం అడిగినట్లు తెలిసినట్లయితే ఎటువంటి భయము లేకుండా ఏసీబీ అధికారులకు టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామని ఏసిబి డిఎస్పి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.