గుడుంబా స్థావరాలపై దాడులు 

నవ తెలంగాణ- మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తూ జోరుగా  విక్రయిస్తున్నారనే  సమాచారం మేరకు మంగళవారం కాటారం ఎక్సైజ్ శాఖ సిఐ ప్రశాంతి ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1800 లీటర్ల నల్లబెల్లం పానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసిన, విక్రయించిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. గుడుంబా నిర్వాహకులు పలువురు పారిపోయినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలోఎక్సైజ్  సిబ్బంది పాల్గొన్నారు.