గుడుంబా స్థావరాలపై దాడులు

నవతెలంగాణ – రాయపర్తి : గ్రామాల్లో, తండాలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుడుంబాను అరికట్టడానికి గురువారం వరంగల్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ మురళీధర్ ఆధ్వర్యంలో మండలంలోని గుబ్బేడి తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 10 లీటర్ల నాటు సారాను, 500 లీటర్ల బెల్లం పట్టుకొని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయదారులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మురళీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడుంబా తయారు చేసిన లేదా విక్రయించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నాటు సారాతో ఆరోగ్యాలు చిన్నభినమై అర్ధాంతరంగా అకాల మరణం చెందుతారని వివరించారు. తండాలో ఇప్పటికైనా నాటు సారా తయారీ విక్రయాలను నిలిపివేయాలన్నారు. ఆయనతోపాటు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ రమేష్ చందర్, వర్ధన్నపేట ఎక్సైజ్ సిఐ స్వరూప సిబ్బంది పాల్గొన్నారు.