న్యాయవాదులపై దాడులు అమానుషం

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
న్యాయవాదులపై దాడులు అమానుషమని హుజూర్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా న్యాయవాదులు నిరసన తెలిపారు. ఇటీవల న్యాయవాది మండ్ర మల్లయ్య,ఆయన భార్య నాగమణిపై భౌతికంగా దాడులు చేస్తూ నాగమణి వస్త్రాలను చించి వేసి భౌతికంగా దాడి చేయడాన్ని ఖండించారు. కేసులు ఏమైనా ఉన్నట్టయితే చట్టపరంగా కోర్టులో పరిష్కారం చేసుకోవాలే తప్ప దాడులు చేయడం దుర్మార్గమన్నారు.దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి రాజగోపాల్‌కు, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్యాంకుమార్‌కు జూనియర్‌ సివిల్‌ జడ్జి మారుతి ప్రసాద్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వట్టికూటి అంజయ్య, రాఘవరావు, మీసాల అంజయ్య,కొట్టు సురేష్‌, ఉదారియాదగిరి,ఎస్‌కె.లతీఫ్‌, గోపినాథ్‌, వీరవంశీ, డి.నారాయణరెడ్డి, రమణారెడ్డి, రామలక్ష్మారెడ్డి,కోటిరెడ్డి, అదానేసాబ్‌, తదితరులు పాల్గొన్నారు.