నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని కస్లాబాద్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న పక్కా సమాచారంతో ఎస్ఐ మహేందర్ తన సిబ్బందితో కలసి పేకాట స్థావరం పై దాడి చెయ్యగా పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుండి 24380 రూపాయలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోని మారుమూల గ్రామాలలో తమ పోలీస్ సిబ్బంది నిఘ ఉందని ఎక్కడ ఏం జరిగినా తక్షణమే తెలిసిపోతుందని మండలంలోని ఎవరైనా పేకాట స్థావరాలు నిర్వహిస్తే పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.