నవతెలంగాణ – చండూరు
మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామీణ వైద్యులపై దాడులు వెంటనే ఆపాలని కోరుతూ సోమవారం చండూరు సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు తో కలిసి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామీణ వైద్యులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు నిత్యం అందుబాటులో ఉంటూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి వైద్యులపై ఐఎంఏ డాక్టర్లు పోలీసులతో కేసులు పెట్టించి గ్రామీణ వైద్యుల పై దాడులు చేస్తున్నారని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. లేనియెడల ఐఎంఏ డాక్టర్లపై ఆర్ఎంపి సోదరులు కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు పోలా రమేష్, ఎండి బషీరుద్దీన్, నల్పరాజు యాదగిరి,రవి, నేర్లకంటి రవికుమార్,సంగెపు మల్లేష్, పురుషోత్తం, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి చారి, గిరి తదితరులు పాల్గొన్నారు.