దేవాలయాలపై దాడులు ఆందోళనకరం..

Attacks on temples are alarming.నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని విశ్వహిందు పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ శర్మ డిమాండ్ చేశారు. హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇటీవల సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వసం చేసిన ఘటనను నిరసిస్తూ రాష్త్ర వ్యాప్త పిలుపులో భాగంగా భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా భజరంగ్ దళ్, విశ్వహిందు పరిషత్, హిందు వాహిని ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. అంతకుముందు స్తానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో హనుమాన్ చాలిసా పారాయణం గావించి మోటార్బైక్ ర్యాలీ ద్వారా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ ధల్ జిల్లా సంయోజక్ బండారి సంతోష్, పట్టణ అధ్యక్షుడు సంతోష్ ఠాకూర్, హిందు వాయిని ప్రతినిధి స్వప్న, వీహెచ్పీ పట్టణ అధ్యక్షుడు దిలిప్ వైద్య, బేల మండల అధ్యక్షుడు నారాయణ, నవీన్, దశరథ్ పటేల్  పాల్గొన్నారు.