నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ : సంక్రాంతి పండగను పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన ముగ్గుల పొట్టి కార్యక్రమం పోటాపోటీగా కొనసాగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీమంత్రి జోగు రామన్న కార్యకర్తలతో పేపర్ పతంగి ఎగురవేస్తూ కార్యకర్త ఉత్సాహంగా పాల్గొన్నారు.. అనంతరం ముగ్గుల పోటీలో కొనసాగించారు. పోటీలో పాల్గొన్న వారికి మొదటి ప్రైజ్ 11వేలు, రెండవ ప్రైస్ ఆరు వేలు, మూడవ ప్రైజ్ మూడు వేలతో పాటు మరో 7గురికి, 7వేల రూ,ప్రోత్సాహక బహుమతి తో పోటీలలో పాల్గొన్న మరో 200 మంది మహిళలకు కన్సోలేషన్ ప్రైజ్ లను అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు అభినందనలతో పాటు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ.. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక క్రీడా కార్యక్రమాల నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో యువకులను ప్రోత్సహిస్తూ క్రికెట్ కబడ్డీ పోటీలను సైతం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే సంక్రాంతి పర్వదినాన మహిళలకు సైతం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతి ఒక్కరు స్నేహభావాన్ని పెంపొందించుకోవడం ముఖ్య ఉద్దేశమన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ప్రతి పథకాన్ని మహిళల పేర్ల మీద ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అధ్యపకురాలు అనిత, విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, సేవ్వా జగదీష్, గండ్రత్ రమేష్, దమ్మ పాల్, కొండ గణేష్, వెనుగంటి ప్రకాష్,అశోక్ స్వామి, బట్టు సతీష్, కడదారపు దేవుధాష్, పరమేశ్వర్,చెందాల ఈశ్వరి, కస్తాల ప్రేమల,స్వరూప రాణి, బొడగం మమత, పర్వీన్, కరుణ, నవతే శ్రీనివాస్, ఉగ్గే విట్టల్ పాల్గొన్నారు.