నవతెలంగాణ -పెద్దవూర
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి.పెద్దవూర మండలకేంద్రం లో పార్టీ మండల అధ్యక్షులు పబ్బుయాదగిరి ఆధ్వర్యంలో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వేట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి రేవంత్‌కు అనుకూలంగా నినాదాలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు కిలారీ మురళికృష్ణ, ముదిరాజ్ ల సంఘం మండలం అధ్యక్షులు అటికం యాదగిరి, మార్కెట్ డైరెక్టర్ ఊరె వెంకన్న, మిట్టపల్లి కిరణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాటి పద్మారెడ్డి, బోయ నరేందర్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, నడ్డి లక్షమయ్య, కోట అంజి తదితరులు పాల్గొన్నారు.