అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-మల్హర్‌రావు
తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలు మండల కేంద్రమైన తాడిచెర్లలో శుక్రవారం మండల కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా తెలంగాణ. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మండల కేంద్రమైన తాడిచెర్లలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఎంపీపీ చింతలపల్లి మలహల్‌రావు, కాగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు బడితేల రాజయ్య, ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, సింగిల్‌ విండో చైర్మన్‌ ప్రకాష్‌ రావు, డైరెక్టర్లు ఇప్ప మోండయ్య,రమేష్‌ రెడ్డి,కిషన్‌ నాయక్‌,సర్పంచ్‌లు సత్యనారాయణ, రాజు నాయక్‌,ఇందారపు చంద్రయ్య,నాయకులు రాఘవ రెడ్డి, రామారావు, కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.
గణపురం : మండలంలోని కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సిఈ సిద్దయ్య, ఎస్సై అభినవ్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అరుంధతి. తాహసిల్దార్‌ సతీష్‌కుమార్‌, సొసైటీ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పొలుసాని లక్ష్మీ నరసింహారావు, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రేపాక రాజేందర్‌, బీజేపీ కార్యాలయంలో జిట్టబోయిన సాంబయ్య, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రాచకొండ భాస్కర్‌, సర్పంచులు నారగాని దేవేం దర్‌గౌడ్‌, నడిపెల్లి మధుసూదన్‌ రావు, పొట్ల నగేష్‌, మామిడి రవి, రామంచ భద్రయ్య, ఎంపీపీ రజిత, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్‌ గౌడ, మంద అశోక్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ అశోక్‌, విద్యాశాఖ కార్యాలయంలో సురేందర్‌ ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఏఈ వెంకటరమణ, ఏపీఎం ధర్మేంద్ర, ఏవో ఐలయ్య మైలారంలో దౌడు రమేష్‌, ఆర్‌ఎంపి మండలశాఖ అధ్యక్షుడు కూతురు రమణ జెండావిష్కరించారు.
కాటారం : కాటారం మండల కేంద్రంలోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యా లయాల ఎదుట జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తహ సీల్ధార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ జివాకర్‌ రెడ్డి, సింగిల్‌ విండో కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల నారాయణరెడ్డి. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్‌ నాయక్‌, ఎంపీటీసీలు తోట జనార్ధన్‌, రవీందర్‌ రావు, జాడి మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు
గోవిందరావుపేట : తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రాజకీయ విభాగాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తాహసిల్దార్‌ కార్యాలయంలో తాహసిల్దార్‌ అల్లం రాజకుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ సిహెచ్‌ కరుణాకర్‌ రావు, పీఏసీఎస్‌లో చైర్మన్‌ పన్నాల ఎల్లారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్‌ సుకుమార్‌ మరియు డాక్టర్‌ మధు లు పశు వైద్యశాల లో డాక్టర్‌ రాజశేఖర్‌ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు.
చిట్యాల : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కోఆప్షన్‌ సభ్యులు మహమ్మద్‌ రాజ్‌మహమ్మద్‌ మాట్లాడారు. పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గణపతి, ఎంపీటీసీ వన్‌ కట్కూరి పద్మా నరేందర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు పాండు రాలస్వామి మన్యం శ్రీనివాసరావు, పెరుమాండ్ల రవి, చిలుముల రమణాచారి, గుర్రం తిరుపతి, చిట్యాల టౌన్‌ కార్యదర్శి మేడిపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
మహాముత్తారం : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ దూలం మల్లయ్య గౌడ్‌ అద్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఉపసర్పంచ్‌ దయ్యాల మీన, వార్డు సభ్యులు కొర్రల్ల సమ్మయ్య, గర్రేపల్లి శ్రీనివాస్‌, ఆకుదారి రాజయ్య, పుట్టపాక వీరస్వామి, పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ, సిఓఏ పెండ్యాల పుష్పలత, రైతు బంధు అధ్యక్షులు పేరాల జగపతిరావ్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులు వేముల బాల క్రిష్ణ, యూత్‌ అధ్యక్షులు భూతం మ దూ కర్‌, ఆర్‌ఎంపి పెండ్యాల వైకంటం, జీపి సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి : మండలకేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ సమ్మయ్య, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి సుజాత సంజీవరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ నాగరాణి, వివిధ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌లు, అన్ని ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జండాను ఆవిష్కరించారు.
వెంకటాపూర్‌ : తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం లో తహశీల్దార్‌ పండకంటి మంజుల, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్‌ఐ తాజుద్దీన్‌, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ శ్రీనివాస్‌, వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మెడబోయిన అశోక్‌, పి ఎ సి ఎస్‌ లో చైర్మన్‌ కాసర్ల కుమారస్వామి, రైతు వేదిక లో మండల వ్యవసాయ శాఖ అధికారి కల్యాణి, పి. హెచ్‌. సి లో వైద్యాధికారి శ్రీకాంత్‌, తదితరులు జాతీయ జెండా ఎగురవేశారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌, డిప్యూటీ తహశీల్దార్‌ కిషోర్‌, రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ రాజకుమారి, రెవెన్యూ సిబ్బంది, ఎంపిడిఒ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహాదేవపూర్‌ : మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎంపీపీ బి రాణీబాయి రామారావు అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద తాత్కాలికంగా నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహాసిల్డార్‌ మాధవి, ఎంపిడిఓ రవీంద్రనాథ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బి. లక్ష్మారెడ్డి, మండల కో.ఆప్షన్‌ సభ్యులు మసూద్‌ అలీ, సర్పంచ్‌ శ్రీపతి బాపు, సీడీపీఓ రాదికారెడ్డి, ఎంపీఓ ప్రసాద్‌, ఏపీఓ రమేష్‌, ఏపీఎం రవీందర్‌, డీటీ కష్ణా, ఎన్‌వైసీ అధ్యక్షులు ప్రభాకర్‌, పాత్రికేయులు, ఐసీడీఎస్‌, ఐకేపీ, రెవెన్యూ, పంచాయితీరాజ్‌ సిబ్బంది, గ్రామ ప్రముఖులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రారంభమైన దశాబ్ది సంబురాలు
మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ రాణిబాయి ఆధ్వర్యంలో తాత్కాలికంగా నిర్మించిన అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి  నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్‌ శ్రీపతి బాపు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్‌ చల్ల తిరుపతిరెడ్డి, తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ ఉమాదేవి,వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల అధికారుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపిడిఓ రవీంద్రనాథ్‌, కాళేశ్వరం దేవస్థానం ఛైర్మెన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు, కాటారం మార్కెట్‌ కమిటీ చైర్‌ ఫర్సన్‌ పెండ్యాల మమత-మనోహర్‌,ఎంపీపీ బి రాణి బాయి,వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్‌ చల్ల తిరుపతిరెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బంధం లక్ష్మ రెడ్డి,మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు మసూద్‌ అలీ, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మెన్‌ పోత వెంకటస్వామి, వార్డు సభ్యులు ఉస్మాన్‌ ఖాన్‌,పంచాయతీ పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్‌ లింగాల రామయ్య,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ వెన్నంపల్లి మహేష్‌,కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్లు కుంభం పద్మ,కలికోట దేవేందర్‌,భారాస మహిళా నేతలు కేదారి గీత, ఓడేటి స్వప్న,నాయకులు శ్రీహరి, ఆన్కరి ప్రభాకర్‌ పాల్గొన్నారు.
బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో
మాహదేవపూర్‌ మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోశుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంపల్లి శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కెసిఆర్‌ నాయకత్వంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, భూపాల పల్లి జడ్పీ చైర్పర్సన్‌ జక్కు శ్రీ హర్షిని రాకేష్‌ నాయకత్వంలో మహదేవపూర్‌ మండలం అభివద్ధి చెందిందన్నారు. ఎంపీపీ బి రాణి బాయి రామారావు, సర్పంచ్‌ శ్రీపతి బాపు, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పెండ్యాల మమత మనోహర్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ చల్ల తిరుపతి రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళ విభాగం మంథని నియోజక వర్గం ఇంఛార్జి కేదారి గీత, మహిళ మండల అధ్యక్షులు ఒడెటి స్వప్న, మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్‌, మండల ఉపాధ్యక్షులు లింగాల రామయ్య, చకినరపు చందు, పార్టీ మండల యూత్‌ అధ్యక్షులు ఆలిమ్‌ ఖాన్‌, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు జక్కయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్‌ వెన్నంపల్లి మహేష్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు కురతోట రాకేష్‌, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్లు కుంభం పద్మ, కలికొట దేవేందర్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు మసుదు అలి, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మెన్‌ పోత వెంకటస్వామి స్వామి, పార్టీ మండల సోషల్‌ మీడియా ఇన్‌చార్జి దబ్బెట రవీందర్‌, పట్టణ యూత్‌ అధ్యక్షులు రేవెళ్ళి రాజశేఖర్‌, సీనియర్‌ నాయకులు పెండ్యాల మనోహర్‌, తడకల రమేష్‌, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరించిన చల్ల తిరుపతి రెడ్డి
మాహదేవపూర్‌ మండల కేంద్రంలోనీ పీఏసీఎస్‌ ఆవరణలో చైర్మన్‌ చల్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎంపీపీ బి రాణి బాయి రామారావు గారు, గ్రామ సర్పంచ్‌ శ్రీపతి బాపు, జెడ్పీటిసీ గుడాల అరుణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, పార్టీ నియోజక వర్గం యూత్‌ ప్రధాన కార్యదర్శి మెరుగు శేఖర్‌, సీఈఓ రాజ బాపు,బి ఆర్‌ ఎస్‌ పార్టీ మండల ఉప అధ్యక్షులు లింగాల రామయ్య, చకినరపు చందు, తదితరులు పాల్గొన్నారు. అలాగే పోలిస్‌ స్టేషన్‌లో ఎస్సై రాజ్‌ కుమార్‌, ప్రభుత్వ డిగ్రీ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌లు, ఆస్పత్రిలో డాక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంలు అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, కాలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు పాల్గొని తెలంగాణదశాబ్ది ఉత్సవాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు.