హైదరాబాద్ : వచ్చే రాఖీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సూత్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రదర్శన బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో దీనిని మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్తృతి, సంప్రదాయతలు, ఆధునిక ఫ్యాషన్లు ప్రతిబింబించు వస్త్రాలు, వివిధ ఉపకారణాలు ప్రదర్శిస్తునలో ఉంచడం అభినందనీయమన్నారు. రాఖీ తీజ్ కొరకు ప్రత్యేకమైన ఫ్యాషన్ దుస్తులు, ప్రత్యేక కలెక్షన్లు, ఆభరణాలు, ఉపకరణాలు వంటివి ఎన్నెన్నో అందుబాటులో ఉన్నాయని సూత్ర ఎగ్జిబిషన్ చైర్మెన్ ఉమేష్ తెలిపారు.