రైతు భీమా కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి: అత్తె సుధాకర్ 

నవతెలంగాణ – మల్హర్ రావు
వచ్చే నెల ఆగస్టు 5వ తేదీలోగా మండలంలో అన్ని గ్రామాల్లోని అర్హులైన రైతులందరూ రైతు భీమా కోసం దరఖాస్తులు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి అత్తె సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అర్హులైన రైతులు తేదీ 14-08-1965 నుండి14-08-2006 వరకు పుట్టిన వారై ఉండాలని, తేదీ 28-06-2024 లోపు పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు మాత్రమే అర్హులన్నారు.18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన,కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇదివరకు రైతు భీమా నమోదు చేయని రైతులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే రైతులు వారియెక్క పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి (ఏఈఓ) గ్రామంలోని రైతు వేదికలో అందజేసి రైతు బీమా నమోదు చేయించుకోవాలని కోరారు.