
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బ్యాక్ లాగ్ ఉద్యోగులను భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రెండు నెలల కింద ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లినట్లు దానితో నామమాత్రంగా ఆపివేసి అందరు మర్చిపోయారని అనుకొని మళ్లీ తొందర్లో నిరుద్యోగులకి అన్యాయం చేయడానికి బ్యాక్ లాగ్ ఉద్యోగాలను అక్రమంగా అడ్డాదారిలో భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నదని ఈ భర్తీని ఆపకపోతే నేను నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తానని రాష్ట్ర నిరుద్యోగ రక్షణ జెఎసి వ్యవస్థాపక అధ్యక్షులు మహిపాల్ యాదవ్ అన్నారు ,శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాదు గడ్డలో కూడా దొడ్డి దారిన బ్యాక్ లాక్ అభ్యర్థులు ఉన్నట్టు మా దృష్టికి వచ్చిందని,ఇప్పటికైనా విరమించుకోకపోతే మీ వివరాలు కూడా సేకరించి అక్రమంగా బ్యాక్ లాగ్ పోస్టులో ఎక్కుతున్న అభ్యర్థుల పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, నిజామాబాదు తో పాటు మీగత జిల్లాలో కూడా ఈ ప్రయత్నం పై పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు..గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలలో మున్సిపల్, ఇరిగేషన్, రెవిన్యూ తదితర శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నాయని,. దీనివల్ల నిరుద్యోగ యువకులకు తీరని నష్టం చేకూరుతుందని . గతంలో కూడా నిర్మల్ మున్సిపల్ లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు , దీనికి ఎంక్వయిరీ కమిటీ అధికారికగా ఆర్డిఓ ని నియమించారు అయినా కూడా 44 ఉద్యోగాలలో జరిగిన అవకతవకల గురించి ఇంకా పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వలేదు, 44 ఉద్యోగాలను అంగట్లో వేలం వేసి అమ్ముకున్నారు వీటిలో కొన్నిటిని అమ్ముకోగా కొన్నిటిని బంధువులకి అప్పనంగా బంధుప్రీతితో కట్టబెట్టారన్నారు., ఒక్కో పోస్టుకి 16 లక్షల వారికి వసూలు చేసినట్టు తమదగ్గర సమాచారం ఉన్నదని చెప్పారు.
అలాగే కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ రావు అన్న బిడ్డ బోయినుపల్లి సరితరావు తెలంగాణ జెన్కోలో ఎఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకి ఎఈ పోస్ట్ ఇచ్చిన జెన్కో ప్రభాకర్ రావు ఆ పోస్టులో ఆమె పనిచేయకుండా ఇంట్లో ఉంటూ నెలకి 1,50,000 జీతం తీసుకుంటుందని, కేసీఆర్ ఓడిపోగానే వెంటనే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిందని ఇన్ని రోజులు ఎక్కడ కనిపించలేదు కదా అని పక్కనే ఉన్న ఉద్యోగులు అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్ రాసింది ఎప్పుడు రిక్రూట్ జరిగింది ఇన్ని రోజులు ఎక్కడా కనిపియలేదు. కదా అని ఆరా తీస్తే తెలిసిన కటోరమైన నిజం వెలుగులోకి వచ్చిందన్నారు . ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే దొరలకి మాత్రము ఎగ్జామ్ రాయకుండా, చదువుకోకుండా, అసలు ఆమె ఇంజనీరింగ్ కూడా చేయకుండా, ఏఈ అయి నెలకి లక్షన్నర రూపాయలు ఎలా ఇస్తున్నారని మండిపడ్డారు.. నిరుద్యోగులని మోసం చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత తరపున కోరుతున్నామన్నారు.
అలా ఒక్కరు కాదు ఐదుగురిని భర్తీ చేసి ఒక్కో పోస్ట్ కి 30 లక్షల వసూలు చేశారని,ఆ ఐదుగురిని జెన్కోలో 2018 ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ట్రైని స్టూడెంట్స్ గా తీసుకొని వీరిని మొదట కాంట్రాక్ట్ ఒప్పందంపై తీసుకొని నెలకి 20 వేల వేతనం చెల్లించారు. ఆ తర్వాత వారిని పర్మినెంట్ పేరుతో బీరసారాల 30 లక్షల వరకు డిమాండ్ చేసి 2019 డిసెంబర్లో పదవ తేదీన జరిగిన జెన్కో 41వ పాలకమండలి సమావేశంలో వీరిని జన్కోలో విలీనం చేసుకునే ప్రతిపాదన లేవనెత్తి దానికి ఆమోదం లభించేలా చేశారు. దాంతో 2020 మార్చ్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (జెఎఒ ) గా వీరిని నియమిస్తూ ఉత్తర్వులు వెలబడ్డాయని,2022 మార్చ్ కల్లా వీరి రెండేళ్ల ప్రోబషనరి పిరియడ్ ప్పూర్తి కావడంతో ఆ కొలువులు పర్మినెంట్ అయ్యాయన్నారు.. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే కనీస అర్హత లేని వారికి శాశ్వత ఉద్యోగాలు దక్కడం జెన్కోలో చర్చనీయా అంశంగా మారిందని . గత నోటిఫికేషన్ లో జరిగిన పరీక్షల్లో వీరంతా అనర్హులు అయినట్లు సమాచారం కాగా వరుస ఆరోపణల నేపథ్యంలో జెన్కో డైరెక్టర్ హెస్ఆర్ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దొడ్డిదారిన జరిగే బ్యాక్లాగ్ నియామకాలని అడ్డుకోవాలని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని . జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డి దారిన జరిగే నియామకాలను అడ్డుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రమోద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.