– బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
నవతెలంగాణ కమ్మర్ పల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతులను నొక్కాలనే ప్రయత్నం చేస్తుందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు.శుక్రవారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టును ఖండిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఇచ్చిన ధర్నా పిలుపులో పాల్గొనకుండా మండలానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, కమ్మర్ పల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపిటిసి మైలారం సుధాకర్ లను ముందస్తుగా అరెస్టు చేసి కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండగా పెట్టుకుందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బిఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ పాలనను కేటీఆర్, హరీష్ రావు ఎండగడుతున్నారనే ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలపై నిర్బంధం కొనసాగిస్తుందన్నారు.ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడమని, ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.