మెడికల్ సర్టిఫికెట్స్ కొరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హజరు కావాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
అమర్నాథ్ యాత్ర కి వెళ్లుచున్న యాత్రికులకు కావలిసిన మెడికల్ సర్టిఫికెట్ కొరకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాదు లో నిర్వహించబడుచున్నటువంటి మెడికల్ క్యాంపు కి హాజరు కాగలరని కోరుచున్నాము. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దీనికి కావాల్సిన మెడికల్ సర్టిఫికెట్ ప్రభుత్వ హాస్పిటల్, నిజామాబాదు నందు అందుబాటులో కలదు. ఇది పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. ట్రావెల్ ఏజెన్సీస్ / ఏదయినా ఇతర ఏజెన్సీస్ వాళ్లు మెడికల్ సర్టిఫికెట్ చేపిస్తాము అని చెపితే అటువంటి మాటలు నమ్మవద్దు అని తెలియజేశారు. ఇది పూర్తిగా ఉచితంగా ఇవ్వబడును. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకై రాజేశ్వర్, జూనియర్ అసిస్టెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాదు రూమ్ నెంబర్ 44 యందు ఫోన్ నెంబర్: 8247853678 సంప్రదించగలరు.