ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి శ్రద్ధ తీసుకోవాలి

– పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశురాం
– ముఖ్య కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ – ముషీరాబాద్‌
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వ విద్యా రంగం బలపడేలా తగు చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పరుశురాం డిమాండ్‌ చేశారు. శనివారం విద్యానగర్‌లోని సీపీభవన్‌ పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొ మ్మిది సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ విద్యారం గం మొత్తం కుంటుపడి అరకోర నిధులు కేటాయింపుతో సమస్యలకు నిలయాలుగా మారి విద్యాభివృద్ధికి నోచుకో లేదన్నారు తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారం గానికి ఎక్కువ శాతం నిధులు కేటాయిస్తానని మాటిచ్చిన రేవంత్‌ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌లు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ గురుకులాలకు వెంటనే సొంత భవనాలు ఏర్పాటు చే యాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రేయంబర్స్‌ మెంట్‌ బకాయిలు రూ. 5,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈఓ ,డైట్‌ కాలేజ్‌ లెక్చరర్‌ ,పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాల సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు రియాజ్‌ ,నాగరాజు, సతీష్‌ రమేష్‌, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.