
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ పాలన పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలంలోని మార్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఈదులకంటి రాజిరెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ తత్తరి అశోక్, బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు చోటే మియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఈదులకంటి రాజిరెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి,మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, బొబ్బిలి నర్సిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు శ్రావణ్ ప్రసాద్ రెడ్డి, గ్రామ శాఖ రాజేష్ పైలెట్, నాయకులు రామిడి రాంరెడ్డి, ఈదులకంటి దయాకర్ రెడ్డి, ముద్దం శ్రీకాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.