నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో అక్రమంగా టిప్పర్లు, డాక్టర్లపై తరలిస్తున్న తరుణంలో సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఈనెల 22న వేలంపాట నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఎంఏ ఖలీమ్ పేర్కొన్నారు. ట్రాక్టర్లకు రూ.3000 రూపాయలు, టిప్పర్లకు రూ.20 వేల రూపాయల ధరావత్తులు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు. రెండు ట్రాక్టర్ల ఇసుక తాసిల్ కార్యాలయం ఆవరణలో వేరువేరుగా ఉంచడం జరిగిందనీ, టిప్పర్లకు సంబంధించిన ఇసుక పేపర్ మిల్ గ్రామ శివారులో సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 22న తహసీల్దార్ కార్యాలయంలో 12 30 నిమిషాలకు వేలంపాటలో పాల్గొనేదవలసిందిగా ఆయన కోరారు.