
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందిన మండల లోని వినాయకపురం పరిధిలో గల శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము 2024 జాతర కం. టెండర్ – కం – బహిరంగ వేలం ప్రకటనను దేవస్థానం ఈ.ఓ సూర్యప్రకాశ్ శుక్రవారం ప్రకటించారు.5 ఏప్రియల్ 24 నుండి 11 ఏప్రియల్ 11 వరకు 7 రోజుల కాలపరిమితి కి లో కొబ్బరి కాయలు, పూజ సామాగ్రి విక్రయించేందుకు,భక్తులు దైవానికి అర్పించిన కొబ్బరి చిప్పలు సేకరించుకునేందుకు, ఐస్ క్రీమ్ లు విక్రయించేందుకు, లడ్డు పులిహోర ప్రసాదాలు విక్రయించేందుకు గాను ఈ నెల అనగా 29 ఫిబ్రవరి 24 గురువారము మధ్యాహ్నం 12 గుంటల 30 నిమిషములకు శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము,శ్రీ అమ్మవారి సన్నిధి నందు దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో టెండర్ – కం – బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. పాటలో పాల్గొనేవారు ఈ క్రింది పట్టిక లో పొందుపరచిన విధముగా దరావత్తు చెల్లించి వేలంపాట పాల్గొనవచ్చు అని తెలిపారు.
టెండర్ – కం – బహిరంగ వేలం పాటల షాపు ల వివరములు
కొబ్బరి కాయలు, పూజ సామాగ్రి దుకాణానికి రూ.25 వేలు,కొబ్బరి చిప్పలు సేకరణకు రూ.20 వేలు,
ఐస్ క్రీమ్ దుకాణము కు రూ.25 వేలు, లడ్డు పులిహోర ప్రసాదం దుకాణం కు రూ.10 వేలు
వేలంపాట షరతులు: ఈ టెండర్ – కం – బహిరంగ వేలంపాట దేవాదాయశాఖ చట్టాలను అనుసరించి అధికారుల ఉత్తర్వులకు లోబడి జరుపబడును.సదరు వేలంపాట టెండర్ – కం – బహిరంగ వేలం ద్వారా నిర్వహించబడును.సదరు డిపాజిట్ డి.డి. ద్వార చెల్లించాల్సి ఉంటుంది. హెచ్చు పాట దారులు పాట అనంతరం డిపాజిట్ సొమ్ము కలుపుకొని,హెచ్చు పాటలో సగం పైకం 15 రోజులలో దేవస్థానం కు చెల్లించి తగు రసీదు పొందాలి. మిగతా పైకం హెచ్చు పాట దారులు వేలంపాట పాడిన నాటి నుండి 1 (ఒక)నెలలలో పూర్తిగా చెల్లించి తగు రసీదు పొందాలి.లేనిచో తిరిగి మరలా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా టెండర్ – కం – బహిరంగ వేలం నిర్వహించబడును.హెచ్చు పాట దారు పై షరతుల ప్రకారం సొమ్ము చెల్లిందని యెడల దరావత్తు సొమ్ము అపరాధ రుసుము క్రింద దేవస్థానానికి జమ చేసే తన హక్కును రద్దు పరిచి తిరిగి సదరు హక్కును బహిరంగ వేలం పాట ద్వారా ఇతరులకు విక్రయించబడును. దేవస్థానానికి గతంలో ఏ విధమైన బకాయిలు,ఇతర లావాదేవీలు ఉన్నవారు కానీ, వారి వారసులు కానీ వేలం పాటలో పాల్గొనేందుకు అనర్హులు.పాట దారులకు సాటి వ్యాపారస్థులు తో కానీ, యాత్రికులతో గానీ వచ్చు వివాదములు తో దేవస్థానము కు ఎటువంటి బాధ్యత లేదు. యాత్రికుల యెడల మర్యాద పూర్వకముగా నడుచుకొనవలెను.ఈ వేలం షరతులు మార్పు చేయుటకు,సడలించేందుకు చేర్చేందకు,ఈ వేలం నిలిపి వేయుటకు,వాయిదా వేయుటకు నిర్వహణ అధికారి పూర్తి అధికారము కలదు. టెండర్ – కం – బహిరంగ వేలం పాటలో పాల్గొనే పాట దారులు కోవిడ్ – 19 నిభందనలు తప్పనిసరిగా పాటించాలి. టెండర్ కాలములో సంభవించు ఎలాంటి ప్రకృతి వైపరిత్యాలు కు గానీ, ఇతరత్ర సంభవించు మానవాతీత, మానవ సంబంధమైన కష్టనష్టాలకు గానీ హెచ్చు పాటదారుడే బాధ్యుడు. దేవస్థానం కు సంబంధం ఉండబోదు.
లడ్డు పులిహోర ప్రసాదం,ఐస్ క్రీమ్ అమ్ము కొనుట హెచ్చు పాట దారు ఫుడ్ & న్యూట్రిషన్ వారి నియమ నిభందనలు కు లోబడి ఉండవలెను.
మిగతా షరతులు పాట సమయంలో తెలుపబడును.
గమనిక: టెండర్ వేయదలచిన వారు డిపాజిట్ పైకం ను డి.డి. ని దేవస్థానం నిర్వహణ అధికారి వారి పేరున యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా,వినాయకపురం బ్రాంచి నందు చెల్లేటట్లు డి.డి. తీయ వలెను. సదరు డి.డి. జిరాక్స్ ను టెండర్ ఫారం కు జత చేయవలెను. టెండర్ ఫారం ఖరీదు రూ.100 (అక్షరాల వంద రూపాయలు) ది.20.02.2024 నుండి ది. శుక్రవారం వరకు దేవస్థానం కౌంటర్ నందు విక్రయించబడును. (పాట అనంతరం హెచ్చు పాట దారుని డి.డి. మినహా మిగతావారి డి.డి. లు అప్పటికప్పుడు తిరిగి వాపసు ఇవ్వబడును. పూర్తి వివరములకు సంప్రదించాల్సిన వారి సెల్ నెంబర్ 9848562060.