– ఆక్షన్‌ను ప్రారంభించిన కేంద్రం
– కొత్త చట్టం ద్వారా ప్రభుత్వానికి అధికారం
– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టీకరణ
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు కీలకమైన ఖనిజాల బ్లాక్‌ల వేలంతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగా ప్రభు త్వం దేశవ్యాప్తంగా 30 కీలకమైన ఖనిజాలను గుర్తించింది. ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలి ప్రాంతం (యూటీ)లోని లిథియంతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో 20 గనుల వేలం ప్రక్రియను గతనెల 29న ప్రారంభించింది. ”భారత ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 29న ఈ ఖనిజాల వేలం మొదటి విడతను 20 బ్లాక్‌ల కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల కోసం ప్రారంభించింది” అని గనులు, బొగ్గు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.