పారదర్శకంగా ముగిసిన వాహనాల, వస్తువుల వేలం..

Auction of vehicles and goods ended transparently.– జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్
నవతెలంగాణ – సిరిసిల్ల
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలో పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న/రోడ్ల మీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలు వేలంపాట నిర్వహించగా ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన  5.36 లక్షలు,జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో సర్వీస్ లో లేని కిట్ ఆర్టికల్స్, పాతబడిన టెంట్లు, ఇనుప సామాగ్రి,జెనరేటర్, స్టోర్ మొదలగు వసువులను వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన 1.54 లక్షల నగదును ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు….60 కి పైగా కొనుగోలుదారులు ఈ వేలం పాటలో పాల్గొన్నారు. ఈ వేలం పాటలో అదనపు ఎస్పీ చంద్రయ్య గారు,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ,ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.