– ఐపీఎల్ ప్రాంఛైజీల డిమాండ్
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆటగాళ్ల వేలంపై ప్రాంఛైజీలు పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం సహా రానున్న సీజన్ నిర్వహణ రోడ్ మ్యాచ్‌పై చర్చించేందుకు పది ప్రాం ఛైజీల యాజమానులతో బీసీసీఐ భేటీ కానుంది. ముంబయిలో గురు వారం ఈ సమావేశం జరుగనుంది. ప్రతి ఐదేండ్లకు ఓసారి మెగా వేలం, 4-6 ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం, ఎనిమిది రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎం), ఆటగాళ్లు ప్రాంఛైజీ వదిలి వెళ్లే వెసులుబాటు తొలగించటం, వేలం పర్సు మొత్తం పెంపు వంటి అంశాలను ఐపీఎల్ అధికారులకు ఇప్పటికే ప్రాంఛైజీ యజమానులు తెలిపారు. ఈ సమావేశం అనంతరం వేలం రూల్స్‌పై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది.