వేలం వేదిక రియాద్‌?

Auction venue Riyadh?– కొత్త వేదిక అన్వేషణలో బీసీసీఐ
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 ఆటగాళ్ల మెగా వేలానికి కొత్త వేదికను ఖరారు చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. గత ఏడాది మినీ వేలాన్ని దుబారు వేదికగా నిర్వహించారు. ఐపీఎల్‌ మేనియాను కొత్త మార్కెట్‌కు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్న బీసీసీఐ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఆటగాళ్ల వేలం నిర్వహించాలని అనుకుంటోంది. నవంబర్‌ 24, 25న రెండు రోజుల పాటు మెగా వేలం జరిగే అవకాశం ఉంది. దుబారుతో పోల్చితే రియాద్‌ ఖరీదైన నగరం. కనీసం నాలుగు రోజుల పాటు ప్రసారదారు సిబ్బంది, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, ప్రాంఛైజీ ప్రతినిధులు, ఇతర సిబ్బంది ఉండేందుకు అన్ని ఏర్పాట్లు బోర్డు చూసుకోవాల్సి ఉంటుంది. వ్యయం, భారత్‌లో ప్రసారాలకు అనుగుణంగా సమయంపై స్పష్టత లభిస్తే త్వరలోనే బోర్డు అధికారిక ప్రకటన చేయవచ్చు.