బైజూస్‌ ఖాతాల తనిఖి..!

న్యూఢిల్లీ : కరోనా కాలంలో భారీ ఆదాయాలను ఆర్జించి.. ఓ వెలుగు వెలిగిన ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ తీవ్ర చిక్కుల్లో పడింది. ఆ సంస్థ ఖాతాలను కార్పొరేట్‌ మంత్రిత్వ శాఖకు తనిఖీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కు బాధ్యతలు అప్పగించిందని సమాచారం. ఇటీవలే ఆ సంస్థను ముగ్గురు బోర్డు సభ్యులు, ఆడిటర్‌ వీడారు. రూ.10వేల కోట్ల నిధుల సమీకరణలో ఉన్న బైజూస్‌ను ప్రభుత్వ నిర్ణయం మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. బైజూస్‌ ఖాతాల వివరాలను తమకు ఆరు వారాల్లో అందించాలని మంత్రిత్వ శాఖ కోరినట్లు సమాచారం. దీనిపై ఇరు వర్గాలు కూడా అధికారికంగా స్పందించాల్సి ఉంది.