– వన్డే సిరీస్‌లో 1-0 ముందంజ
మెల్‌బోర్న్ : పాకిస్థాన్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 204 పరుగుల ఛేదనలో 139/6తో ఒత్తిడిలో పడిన ఆతిథ్య జట్టును కెప్టెన్ పాట్ కమిన్స్ (32 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు) ఆదుకున్నాడు. స్మిత్ (44), ఇంగ్లిశ్ (49) రాణించినా.. పాక్ పేసర్ల జోరుతో ఆసీస్ కష్టాల్లో కూరుకుంది. టెయిలెండర్ల మెరుపులతో 33.3 ఓవర్లలో ఆసీస్ 204/8 పరుగులు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. అంతకుముందు, రిజ్వాన్ (44), బాబర్ (37), నసీం (40) రాణించటంతో తొలుత పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు కుప్పకూలింది.