అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ 33 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో కంగారూలు సెమీస్ బెర్త్‌కు మరింత చేరువ కాగా.. ఇంగ్లండ్ ఏడింట ఆరో ఓటమితో అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (71) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్మిత్ (44), గ్రీన్ (47), స్టోయినిస్ (35), జాంపా (29) కీలక పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4 వికెట్లు పడగొట్టాడు. చేజింగ్ లో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ (64), మలాన్ (50), మోయిన్ అలీ (42) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జాంపా 3 వికెట్లు తీశాడు.