బార్బడోస్: గ్రూప్-బిలో ఆస్ట్రేలియా జట్టు ఒమన్‌పై కష్టంగా నెగ్గింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 164పరుగులే చేసింది. ఛేదనలో ఒమన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్ల నష్టానికి 125పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్ వార్నర్(56), స్టొయినీస్ (67నాటౌట్; 36బంతుల్లో 2ఫోర్లు, 6సిక్సర్లు) రాణించాడు. ఒమన్ ఆటగాడు మెహ్రాన్‌ఖాన్ బౌలింగ్‌లో స్టొయినీస్ ఏకంగా నాలుగు సిక్స్‌లు (2, 6, 6, 0, 6, 6) బాది 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టొయినీస్‌కు లభించింది.