నవతెలంగాణ – కంటేశ్వర్
పిల్లల్లో బుద్ది మాంధ్యం పదేపదే మాట్లాడడం సరిగ్గా మాట్లాడే లేకపోవడమే అటిజం లక్షణాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. నవజాత శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే వారు అటిజం బారిన పడకుండా చూడవచ్చని అటిజం బారిన తల్లిదండ్రులకు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ మెంటల్ హెల్త్ కమిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవాన్ని స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్దయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ నవజాత శిశువు నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడం బుద్ధి మాoద్యం అలాగే పదేపదే మాట్లాడడం అలాగే విచిత్రంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు ఉండడాన్ని అటిజం బారిన పడ్డ పిల్లలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. అయితే ఈ అటిజం బారిన పడడానికి చాలా రకాల కారణాలు ఉంటాయని ఆయన చెప్పారు. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం అలాగే సరైన మందులు వాడకపోవడం అలాగే శరీరానికి పోషకాహారాలు లేని అనవసర ఆహార పదార్థాలు తీసుకోవడం అలాగే మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆర్టిజన్ బారిన పడతారని చెప్పారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే ఈ విషయాన్ని గమనించి వారికి సరైన పోషక ఆహారం ఇవ్వడం వారిని ప్రోత్సహించే విధంగా వైద్యుల సలహాలతో ముందుకు వెళ్లినట్లయితే వారు ఉన్నత స్థాయికి ఎదగాగలరని తెలిపారు. ఇప్పటికే ఎంతోమంది అటిజం బారిన పడిన కూడా ఏదోరంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని వారు చెప్పారు.. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి మాట్లాడుతూ ఆర్టిజం బారిన పడ్డ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మానసిక వైద్యులు డాక్టర్ ఆకుల విశాల్ విషయాలు క్లుప్తంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. త్వరలో అటిజం బారిన పడ్డ పిల్లలకు వారి తల్లిదండ్రులకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అటిజం పట్ల అవగాహన కల్పించేందుకు సహకారం అందించాలని వైద్యులు డాక్టర్ విశాల్ ను కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి స్నేహ సొసైటీ విద్యార్థులు, మరియు అటిజం భారిన పడిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.