నవతెలంగాణ – కోనరావుపేట
అనారోగ్యంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన తుమ్మల రాము (32) అనే ఆటో కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం గత కొన్ని రోజుల నుండిఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆటో నడవక డబ్బులు లేక ఖరీదైన వైద్యం చేయించుకోలేకనే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతిని భార్య లతా కుమారులు శ్రీహర్ష వివేక్ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సింగల్ విండో వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి కోరారు.