పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్ళే ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలి..

– అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు అవగాహన.. 
– ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ షాకీర్ హుస్సేన్..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ట్రాఫిక్ కమిషనర్ శ్రీ విశ్వ ప్రసాద్ ఆదేశాల మేరకు శనివారం అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యార్థులను తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లు  యూనిఫాం ధరించాలని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని అన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. నిబంధనలను పాటించకుంటే చాలన్ విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎల్ రవికుమార్, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.