— తమడపల్లిలో మృతి చెందిన ఆటో డ్రైవర్ జక్కలి చిన్నయ్య
– పెదఖర్మ కార్యక్రమానికి 50 కిలోల బియ్యం, వంట సామాగ్రీ వితరణ
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తమడపల్లి గ్రామానికి చెందిన జక్కలి చిన్నయ్య(36) అనారోగ్యం తో డిశంబర్ 28 న అనారోగ్యం తో మృతి చెందారు.సోమవారం దశదిన కర్మకు కొత్తలూరు ఆటో డ్రైవర్ యూనియన్ సంఘం స్పందించి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి ఖర్చులు 10 వేలు ఆర్థిక సహాయం చేయూతనందించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ జక్కలి చిన్నయ్య కుటుంబ సభ్యులను ఆటో యూనియన్ అధ్యక్షులు రావుల పాటి శంకర్, ఉపాధ్యక్షులు జానపాటి కొండల్ ,ఆటోయునిన్ మృతునికి నివాళులు అర్పించి మృతుని భార్య రమణ, మాతృమూర్తి కౌసల్యకు వితరణ అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆటోయూనిన్ కార్యదర్శి కమ్మంపాటి సత్యం, కోశాధికారీ జిల్లా కోటేష్, సభ్యులు పసుల రవి, కుక్క సైదులు, సింగారం ప్రశాంత్, కట్ట మహేష్, దోరేపల్లి నవీన్, రావులపాటి రాంబాబు, రావులపాటి మధు తదితరులు వున్నారు.