నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ సబ్ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికల సమరం ముగ్గురు నాయకుల మధ్య రసవత్తరంగా సాగుతుంది ఎన్నికల బరిలో మేమే గెలుస్తామంటూ ఒకరికొకరు ధీమాతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం యూనియన్ ఎన్నికల్లో తమనే గెలిపించాలని ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ, ఎన్నికల్లో నెగ్గేదెవరు..!ఓడెదెవరో..? అభ్యర్థులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బత్తుల దేవరాజు, సయ్యద్ ఉమర్ ల మధ్య ఉత్కంఠ భరితమైన పోటీ ఉంటుందని ఆటో డ్రైవర్లు ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారో ముగ్గురి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుందని ఈ పోటీలో గెలుపు, ఓటములు తెలియాలంటే సోమవారం మధ్యాహ్నం వరకు ఆగల్సిందే పలువురు ఆటో డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు.