పంచాయతీ కార్మికులకు ఆటో యూనియన్ మద్దతు

నవతెలంగాణ-గోవిందరావుపేట
గత ఎనిమిది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు గురువారం మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు గోరంట్ల సాంబశివరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి ప్రజా ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పంచాయతీ కార్మికులను సన్మానించిన ప్రభుత్వం వారి డిమాండ్లు ను కూడా అదే విధంగా నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ధోని సాయిలు, గాజుల చంద్రయ్య, పాయం వెంకన్న, కురుసం నాగరాజు, నావారం మహేశ్, సంగి సందీప్ తదితరులు పాల్గొన్నారు.