
– తప్పిన పెను ప్రమాదం..
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలములో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి మండలంలోని నార్లాపూర్ చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. చింతల్ క్రాస్ వద్ద ఆటో వేసుకొని పగిడాపుర్ గ్రామానికి చెందిన పొనక వినోద్ ఆయన (స్వగ్రామం) పడిగాపురంలోని ఇంటి నుండి ఆటో లో పస్రా వెళ్ళే క్రమంలో వాగు దాటే ప్రయత్నం చేస్తుండగా ప్రవాహం ఎక్కువ ఉండటంతో ఆటో తో పాటు వ్యక్తి గల్లంతు అయ్యాడు, ఆటోని పట్టుకొని కొంత మేర వాగులో ఒక ఒడ్డుకు చిక్కుకోగా స్థానికులు డ్రైవర్ వినోద్ ని తాడు సహాయంతో బయటకు లాగారు, ఆటో లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనీ చెప్పవచ్చు. ఆటోలో విలువైన పత్రాలు, ఆటో ఇంజన్ లకు నీరు పోయి మొత్తం ధ్వంసం (కరాబ్) అయింది. సంఘటన స్థలానికి పస్రా సిఐ గద్ద రవీందర్, స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి లు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఎవరు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా మాకు తెలియకుండా జంపన్న వాగు పరిసర ప్రాంతాలు ఉన్న గ్రామాల ప్రజలు దాటరాదని సూచించారు.
