‘ఆటో కార్మికులకు ఉపాధి కల్పించాలి’

నవతెలంగాణ-మియాపూర్‌
ఆటో కార్మికులకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇటీవల ఉపాధి లేక ప్రజాభవన్‌ ముందే ఆటోను తగలబెట్టుకున్నా ఆటో డ్రైవర్‌ మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని నడిగడ్డ తండాకి చెందిన ఎం.దేవ్లా నాయక్‌ కుటుంబాన్ని కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. దేవ్లానాయక్‌కు టుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, కుటుంబాన్ని ఆగం చేయకూడదని తెలపారు. ‘ఫ్రీ బస్‌ ప్రయాణా నికి వ్యతిరేకం కాదు’ అని ఆటో డ్రైవర్లకు జీవ నోపాధి కలిపించాలని ఎమ్మెల్యే అన్నారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని, ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్‌ కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆర్థికసాయాన్ని అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చందానగర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు స్వామి నాయక్‌, హన్మంత్‌ నాయక్‌, తిరుపతి నాయక్‌, గోపి నాయక్‌, సుధాకర్‌, కమలాకర్‌, మోహన్‌ నాయక్‌, జితేందర్‌ నాయక్‌, రవీందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.