ఆదిలాబాద్ లో ఈనెల 7న ఆటోలు బంద్

Autos bandh on 7th of this month in Adilabadనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయని రీత్యా ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన ఆటో క్యాబ్ వ్యాన్ తదితర వాహనాల బంద్ నిర్వహిస్తున్నామని యూనియన్ జిల్లా అధ్యక్షులు దళిత్ టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ తెలిపారు. మంగళవారం ఆటో బంద్ కు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ బందులో  ఆటో వ్యాన్ టాక్సీ వాహనాలన్నీ బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం మోటార్ కార్మికుల సమస్యలను విస్మరించిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఆటో మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి రూ.12 వేల మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న వారికి నెలకు రూ.6 వేళ చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో కార్మికులు రమేష్, నరేష్, సయ్యద్ అనీష్, షేక్ ధనిష్, మహమ్మద్ సహిబాజ్, షేక్ అసిఫ్, షేక్ జావిద్, బుచ్చిరం, సద్దాం, సాయి, ఇర్ఫాన్, రఫిక్, అవినాష్, రంజిత్ పాల్గొన్నారు.