
ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఈనెల 13,14,15 తేదీలలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పెద్దవూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం నాగార్జునసాగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్, కోరే రమేష్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు సమాజం మార్పు కొరకు ఉపయోగపడతాయన్నారు.ఎస్ఎఫ్ఐ చదువుకై పోరాడమని నినాదంతో విద్యారంగ సమస్యల పట్ల సమాజంలో ఉన్న సమస్యల అధ్యయనం చేసుకుంటూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. దేశంలో విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తు, విద్యా కాషాయకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు.. శాస్త్రయ విద్యా విధానం కోసం అందరికీ సమాన విద్యా కావాలని భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ క్లాసులలో భవిష్యత్ పోరాటాలు, నిర్మాణం,శిక్షణ తరగతులు ఇవ్వబడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి, శివాని,కావ్య,రాజేష్,చందు,సాయి, నాగ,తదితరులు పాల్గొన్నారు.