ప్రజలకు అందుబాటులో వైస్ ఎంపిపి బడితేల  స్వరూప రాజయ్య


– సింగిల్ విండో డైరెక్టర్లు ఆత్మీయ సన్మానం 
నవతెలంగాణ మల్హర్ రావు : మండలంలోని రుద్రారం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన ప్రజా నాయకురాలు  మండల వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్యని సింగిల్ విండో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు,డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు ,సంగ్గేం రమేష్ అన్నారు.వైస్ ఎంపిపి పదవీకాలం ముగియడంతో  ఆమె నివాసంలో దంపతులకు శాలువా,పూలమాలతో ఆత్మీయ సన్మానం నిర్వహించి,బొకే అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ డైరెక్టర్లు మాట్లాడారు వైస్ ఎంపిపిగా ఐదేళ్లలో గ్రామ ప్రజలకు అందించిన సేవలు,చేసిన అభివృద్ధి గొప్పదన్నారు. గ్రామంలో ఎక్కడ సమస్యలు ఉన్న పరిస్కారం అయ్యేలా తనవంతుగా కృషి చేశారన్నారు.భవిష్యత్ లో మరిన్ని ఉన్నతా పదవులు చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.