ఎవరీ కార్తికేయ..?

ఆస్కార్‌ వేదికపై అవార్డుని అందుకున్న తరుణంలో తన ఆనందాన్ని పాట రూపంలో వ్యక్తం చేశారు కీరవాణి. అందులో భాగంగా రాజమౌళితోపాటు కార్తీకేయ గురించి కూడా చెప్పారు. దీంతో ఎవరీ కార్తికేయ అని అందరిలో ఆసక్తి రేకెత్తింది. రాజమౌళి ఆస్కార్‌ కలని సాకారం చేసింది ఆయన తనయుడు కార్తికేయ అని తెలిసింది. అసలు ఆస్కార్‌ ప్రాసెస్‌ ఏంటి?, ఎలా అప్లై చేయాలి?, అవార్డు రావాలంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి?, ఓవర్సీస్‌ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాని ఎలా వాడుకోవాలి?, యు ట్యూబర్స్‌తో ఎలా ‘నాటు’ పాట కవర్‌సాంగ్స్‌ చేయించాలి?, మన హీరోలతో ఎలాంటి ప్రచారం చేయించాలి?, ఎవరి పార్టీలకు చిత్ర బృందం అటెండ్‌ అవ్వాలి?, గోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల పరిస్థితి ఏంటి? ఇవి దక్కించుకుంటే ఆస్కార్‌ని పొందటానికి ఎంత శాతం ఉపయోగపడుతుంది?, ఇలా ఆస్కార్‌కి అప్లై చేసిన దగ్గర్నుంచి ఆస్కార్‌ని అందుకునేంత వరకు కార్తీకేయ స్కెచ్‌ చాలా కీలకంగా పని చేసింది. దీని కోసం ఎంత డబ్బు, సమయం వెచ్చించాలో కూడా తనే నిర్ణయించాడు. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గానూ చేశారు.