ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అవినాష్ కాలేజ్..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించిన 2024 ఇంటర్ ఫలితాల్లో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎల్ బి నగర్ బ్రాంచుకు చెందిన గోలి రశ్మిత 496 స్టేట్ టాప్ మార్క్ సాధించింది. అలాగే 9 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ మార్కులతో రాష్ట్ర స్ధాయిలో ప్రతిభ కనబర్చారు. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఇంటర్ లో 75 మందికి పైన విద్యార్థులు టాప్ 5 ర్యాంకులు సాధించడం ఎంతో గర్వకారణం అని సంస్ధ చైర్మన్ Dr . అవినాష్ బ్రహ్మదేవర తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను యాజమాన్యం అభినందించి సత్కరించారు. ఈ సందర్బంగా శ్రీ అవినాష్ బ్రహ్మదేవర మాట్లాడుతూ…విద్యార్థులు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాలికను ప్లాన్ చేసుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని ప్రోత్సహించారు. స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లి తండ్రులను ఎంతో అభినందించారు. అవినాష్ కాలేజీ ఆఫ్ కామర్స్, సికింద్రాబాద్ బ్రాంచిలో జరిగిన మీడియా సమావేశంలో కాలేజ్ చైర్ పర్సన్ Dr . అవినాష్ బ్రహ్మదేవర, డైరెక్టర్స్ సంతోష్ బుద్ద, కే.పట్టాభిరామ్, డీన్ అకాడెమిక్స్ – అవినాష్ గ్రూప్ సుశీల కందూరి మరియు రాష్ట్రంలో మొదటి ర్యాంకులు సాధించిన ఎల్.బి.నగర్ ఇంటర్  బ్రాంచ్ ప్రిన్సిపాల్ నీరజ లోకసాని తో పాటు ఇతర బ్రాంచి ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది 10 సంవత్సరాల అకడమిక్ ఎక్సలెన్స్, 700కి పైగా ఫ్యాకల్టీ, 12 బ్రాంచ్‌లు మరియు 20,000 కంటే ఎక్కువ మంది విద్యార్థుల నమోదుతో 25+ కామర్స్ కెరీర్ ఎంపికలను అందిస్తూ కామర్స్ విద్యకు NO .1 గా నిలిచింది.  అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దక్షిణ భారతదేశంలోనే నంబర్.1 కామర్స్ కళాశాలగా నిలవడమే కాకుండా, వరుసగా గత 10 సంవత్సరాలుగా MEC & CECలో టాప్ మార్కులను సాధించింది.