
మండల వ్యవసాయ శాఖ ద్వారా మండల వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేకంగా అధికారులు కృషి చేస్తున్నారని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. శుక్రవారం నాడు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వ్యవసాయదారులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ జెండావిష్కరణ కార్యక్రమంలో మండలంలోని ఏఈవోలు పాల్గొన్నారు.