– పరామర్శించడం మానవీయమని రత్నాకర్ రెడ్డి కితాబు
నవతెలంగాణ – బెజ్జంకి
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కాంగ్రెస్ పార్టీ కల్పించడతోనే ఆటోడ్రైవర్లు మృతి చెందుతున్నారనే సత్యదూరమైన వాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పార్టీ కార్యాలయం వద్ద సూచించారు. మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బుర్ర కరుణాకర్ మృతి చెందడం బాధకరమేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత ఆటోడ్రైవర్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించడం మానవీయమేనని స్వాగతించారు. గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి ప్రయాణీకుల సౌకర్యార్థం మండల కేంద్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సుమారు 12 ఆర్టీసీ బస్సులు నడిపించినప్పుడు బస్సులను రద్దు చేయాలని ఆటోడ్రైవర్లు దర్నాలు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు స్పందించలేదని రత్నాకర్ అసహనం వ్యక్తం చేశారు.ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదని వారిని రెచ్చగొట్టే దోరణి అవలంబించకుండా వారి జీవనానికి సలహాలు సూచనలు అందించాలని బీఆర్ఎస్ నాయకులకు రత్నాకర్ రెడ్డి సూచించారు.