నవ తెలంగాణ- సూర్యాపేట: నవ తెలంగాణ దిన పత్రిక లో వృత్తి పరంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన సీనియర్ జర్నలిస్ట్ జహంగీర్ ను రాష్ట్ర, ఉమ్మడి నల్గొండ జిల్లా బాద్యులు ప్రశంసించారు. ఇందులో భాగంగా మిర్యాలగూడలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా రీజియన్ వర్క్ షాపులో రాష్ట్ర, ఉమ్మడి నల్గొండ జిల్లా బాద్యులు ఆయన కు బహుమతి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రీపోర్టర్ లు, ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.